తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్
న్యూస్‌తెలుగు/ముంబయి: విభిన్నమైన, ఫ్యాషనబుల్ ఐవేర్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది వోగ్ ఐవేర్. ఇప్పటికే తమ ఐవేర్‌తో ఎంతో మంది వినియోగదారుల్ని సంపాదించుకున్న వోగ్ ఐవేర్.. ఇవాళ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేటెస్ట్ కలెక్షన్‌ను వోగ్ ఐవేర్ బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్ను లాంచ్ చేశారు. ఇప్పటి తరానికి నచ్చే ఆధునిక ట్రెండ్‌తో పాటు అత్యధిక నాణ్యతతో, అదే సమయంలో తాప్సీ విభిన్నమైన స్టైల్‌తో.. అన్నింటికి మించి వోగ్ ఐవేర్ బ్రాండ్‌కు తగ్గట్లుగా ఈ సరికొత్త కలెక్షన్‌ను డిజైన్ చేశారు. ఈ సరికొత్త కలెక్షన్‌లో మొత్తం 5 రకాల మోడల్స్, 3 సన్ గ్లాసెస్, 2 ఆప్టికల్ ప్రేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెష్ కలర్‌తో చాలా వేటికవే విభిన్నంగా ఉన్నాయి. ఇవన్నీ మీ స్టైల్‌ను మరింతగా పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో విభిన్న రకాలైన ఆకృతులు కూడా ఉన్నాయి. పెద్ద సీతాకోక చిలుక, సైనస్ క్యాట్ ఐ, రెట్రో రెగ్యులర్ వంటి వివిధ రకాల ఆకృతులు ఈ సరికొత్త కలెక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి కళ్లజోడు ఖచ్చితమైన శ్రద్ధతో రూపొందింది. మరోవైపు మెటల్ నోస్ బ్రిడ్జ్, ప్రత్యేకమైన డీబోస్డ్ ప్యాటర్న్ లాంటి డెకర్ ఎలిమెంట్‌లను ఈ కలెక్షన్ కలిగి ఉంటాయి. (Story : తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్)