ఘనంగా జరిగిన మిలాద్ ఉన్ నబి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని మిలాద్ ఉన్ నబీ కమిటీ ఆధ్వర్యంలో ఫారుక్ నేతృత్వంలో అధ్యక్షులు మెహబూబ్ వలి, కార్యదర్శి హైదర్ వలీ లా మార్గదర్శకంలో మిలాద్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి గంధంతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఊరేగింపుగా తిరిగి మరుసటి రోజు బైక్ ర్యాలీని ఆ సార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. తదుపరి మక్కా మసీదు నమూనాను పట్టణ పురవీధులలో ఊరేగిస్తూ మహమ్మద్ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. అనంతరం కమిటీ వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు, సూక్తులు సూచించిన ధార్మిక విషయాలు అందరూ అనుసరించాలని తెలిపారు. తోటి వారికి కరుణ సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యము నెరవేరుతుందని తెలిపారు. ఎన్టీఆర్ సర్కిల్, కళాజ్యోతి సర్కిల్, ఎర్రగుంట, ఆర్టీసీ బస్టాండ్, బ్రాహ్మణ వీధి చెరువు కట్ట వద్ద గల మసీదు వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. తదుపరి మహమ్మద్ షా ఖాదర్ వలీ దర్గా వద్ద 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి మహమ్మద్ ప్రవక్త శిరోజాలను భక్తాదులకు చూపించారు. ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరాముడు ట్రాఫిక్కుకు ఇబ్బంది లేకుండా సిబ్బంది ద్వారా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ముస్తాక్ అహ్మద్, మహబూబ్ బాషా, వారి బృందము, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన మిలాద్ ఉన్ నబి)