జెఎన్ టియుజివి ఇంజనీర్ల దినోత్సవం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : జె ఎన్ టి యు జి వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లో ఆదివారంభారత రత్న సర్ మోక్ష గుండం విశ్వేశరాయ జయంతిని పురస్కరించుకుని ‘ ఇంజనీర్స్ డే నిర్వహించారు. ముందుగా’సర్ మోక్ష గుండం విశ్వేసరాయ’ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిథిగా హాజరైన జెఎన్ టియుజివి ఇంఛార్జ్ ఉప-కులపతి ప్రొఫెసర్. డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, అందరికి ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ‘భారత రత్న’ సర్ మోక్షగుండం విస్వేశరాయ భారతదేశానికి చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమన్నారు. విద్యార్ధులు దేశానికీ మూల స్తంభాలనీ, విద్యార్ధుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ప్రతీ విద్యార్ధి నైతిక విలువలు పాటిస్తూ, దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతీ ఇంజినీరింగ్ విద్యార్ధి “సర్ మోక్షగుండం విశ్వేశరాయ” ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడలలో నడవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్ధులు అద్భుతాలను సృష్టించగలరని తెలియజేశారు.
కార్యక్రమానికీ గౌరవ అతిధిగా హాజరైన యూనివర్సిటీ ఇంజినీర్ ఎస్. వేణుగోపాలరావు మాట్లాడుతూ, సివిల్ ఇంజినీరింగ్ విద్యార్ధులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాల ముఖ్యమని, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతీ విద్యార్ధి గర్వ పడాలన్నారు. పనిని పూర్తి చేయడానికి ప్లానింగ్ చాలా ముఖ్యమనీ అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్. రాజేశ్వరరావు మాట్లాడుతూ, సివిల్ ఇంజనీరింగ్ను “రాయల్ సివిల్” అని అంటారని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని విద్యార్దులు ఉన్నత చదువులు చదువుకుని, దేశాభివృద్దిలో భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో సివిల్ ఇంజనీరింగ్ ఇంచార్జి విభాగాధిపతి డాక్టర్ జి. అప్పల నాయుడు,డాక్టర్ ఆర్.గురునాధ, పరీక్షల నియంత్రణాధికారి,
డాక్టర్. సి. నీలిమా దేవి, అదనపు పరీక్షల నియంత్రనాధికారి, డాక్టర్. కె. శ్రీనివాస ప్రసాద్,
డాక్టర్. సిహెచ్.బిందు మాధురి, ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు, బోధనా, భోదనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు (Story : జెఎన్ టియుజివి ఇంజనీర్ల దినోత్సవం)