లోక్ అదాలతో ఇచ్చే తీర్పే తుది తీర్పు
మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జాతీయ మెగా లోక్ అదాలత్ లో ఇచ్చే తీర్పే తుది తీర్పు అవుతుందని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ గీతావాణి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ధర్మవరం కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలతో జడ్జి ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం జడ్జి గీతావాణి మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోక అదాలతో జరిగిందని తెలిపారు. ఈ జాతీయ మెగా లోక్ అదాలతో కోర్టు పరిధిలో ఉన్నటువంటి మొత్తం 155 కేసులు పరిష్కారం కావడం జరిగిందని తెలిపారు. రాజీకి కాబడే కేసులు మాత్రమే ఈ లోకదాలతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. కచ్చిదారులు, న్యాయవాదులు, పోలీసులు సమన్వయంతో ఈ లోక్ అదాలతో విజయవంతం చేయడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశా రు. మొత్తం పరిష్కరించబడిన 155 కేసులలో…. భార్యాభర్తలను కలిపిన కేసులు 2, బ్యాంకు రుణాలు 31 (రూ.9,63,500), గొడవ కేసులు 41, భరణం కేసులు 2(4,70,000 రూ.), చెక్ బౌన్ కేసులు 01, (రూ. 1,50,000), ప్రామిసరీ నోటు కేసులు 01,(రూ. 1,50,000), భూమి తగాదా కేసులు 01(ఐదు లక్షలు), ఈ పీ కేసులు 01(50,000 రూపాయలు), ఇసుక రవాణా కేసులు 23 (5 లక్షల 50 వేలు రూపాయలు), పెట్టి కేసులు 52 (8 లక్షల 25 వేల 80 రూపాయలు) కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలతో సభ్యులు బాలసుందరి, కిషోర్ కుమార్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. (Story : లోక్ అదాలతో ఇచ్చే తీర్పే తుది తీర్పు )