కామ్రేడ్ సీతారాం ఏచూరికు సిఐటియు నివాళులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం శ్రీ సత్య సాయి జిల్లా : కామ్రేడ్ సీతారాం ఏచూరి సిఐటియు ఆఫీసు నందు ప్రభుత్వ పాఠశాల స్లీపర్స్ కలుపుకొని నివాళులు అర్పించడం అర్పించారు. ఈ సందర్భంగా జె.వి .రమణ సి ఐ టి యు మండల కన్వీనర్, టి అయుబ్ ఖాన్ మండల కో కన్వీనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, రైతాంగాల సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల ఉద్యమాలు, విద్యార్థి దశ నుంచి పోరాడిన పోరాట యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆంధ్ర నుంచి సిపిఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య , తర్వాత అంతటి నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మూడు పర్యాయాలు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉంటూ, పేదల కోసం, బడుగు బలహీన వర్గ ప్రజల కోసం పెత్తందారులతో రాజీలేని పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎంతో ఉన్నతమైన ఉత్తమమైన పోరాట యోధుడు మరణించడంతో కార్మిక కర్షక రైతులకు తీరని లోటు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల స్లీపర్స్ సంఘం కార్యదర్శి సి .చౌడమ్మ , అధ్యక్షురాలు ఓ. జయమ్మ ,ఆర్ భాగ్యలక్ష్మి, యశోద, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.