జిల్లాకు జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకురావాలి
యోగా అసోసియేషన్ జిల్లా అధ్యుక్షులు అవనాపు విక్రమ్
న్యూస్‌తెలుగు/విజయనగరం: విజయనగరం జిల్లా నుంచి 49వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు వెళ్తున్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యుక్షులు అవనాపు విక్రమ్ ఆకాంక్షించారు. జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైన 30 మంది క్రీడాకారులు అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్ధాయి పోటీలకు వెళ్లేందుకు పయనమయ్యారు. వారందినీ అసోసియేషన్ అధ్యుక్షులు విక్రమ్ అభినందించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ యోగాకు విశేష ప్రాధాన్యం లభిస్తోందని, ప్రధాని మోదీ సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. యోగ క్రీడ గానే కాక ఆరోగ్యానికి మనోవికాసానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, మన సంస్కృతి సంప్రదాయాల్లో యోగా భాగమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ క్రీడా సంఘం కార్యదర్శి సిహెచ్ వేణుగోపాల్, జిల్లా యోగ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భమిడిశెట్టి సన్యాసిరావు, యోగా శిక్షకులు, యోగా క్రీడాకారులు పాల్గొన్నారు.(Story:జిల్లాకు జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకురావాలి )