Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

0

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

– పార్కింగ్ ప్రాంతాల కోసం కార్యాచరణ ప్రణాళిక

– టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు

న్యూస్‌తెలుగు/తిరుమల : 

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో శ్రీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

అక్టోబరు 8న గరుడసేవ రోజున అదనపు పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్‌ అధికారులను ఈవో ఆదేశించారు.

తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయి. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీ, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఈవో ఆదేశించారు.

అనంతరం ఇంజినీరింగ్ పనుల పురోగతి, రవాణా, వసతి, నీరు, అన్నప్రసాదాల పంపిణీ, సరిపడా శ్రీవారి సేవకుల ఏర్పాటు, ఉద్యానవన విభాగం అలంకరణలు, తగినన్ని లడ్డూల నిల్వ, ఉత్తమ కళా బృందాల ఎంపిక, అదనపు మరుగుదొడ్లు తదితర అంశాలపై ఈవో సమీక్షించారు.

తనిఖీలు

అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్, పోటును సంబంధిత అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.

ఈ తనిఖీల్లో భాగంగా లడ్డూ కౌంటర్లు, బూందీ పోటులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోటుపై సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఈఈ1 శ్రీ సుబ్రహ్మణ్యం, రవాణా విభాగం జీఎం శ్రీ శేషారెడ్డి, సిపిఆర్వో డాక్టర్ టీ. రవి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version