Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గణిత శాస్త్ర అవగాహన సదస్సు 

గణిత శాస్త్ర అవగాహన సదస్సు 

0

గణిత శాస్త్ర అవగాహన సదస్సు 

న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక వెల్లటూరు రోడ్డు లోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో డాక్టర్ ఇన్నారెడ్డి గణిత శాస్త్రం పై అవగాహన సదస్సు శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఇన్నారెడ్డి గణిత శాస్త్ర ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ మానవ జీవితంలో గణిత శాస్త్రానికి ఒక ప్రాముఖ్యత ఉన్నదని తెలిపారు. అన్ని రకాల శాస్త్రాలలో గణిత శాస్త్రం ముఖ్యమైనదని తెలిపారు. గణిత శాస్త్రం లేకుండా మానవ జీవితమే లేదని తెలిపారు. జీవితం అంటేనే కూడికలు, తీసివేతలు, అంకెలు, గణాంకాలు అని తెలిపారు. అన్ని శాస్త్రాలు గణిత శాస్త్రంతో మిళితమై ఉంటాయని తెలిపారు. గణిత శాస్త్రం ప్రమేయం లేకుండా ఏ శాస్త్రం కూడా లేదని తెలిపారు. ఎవరైతే గణిత శాస్త్రం పై మక్కువ చూపుతారో వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు. స్కూల్ ప్రిన్సిపాల్ జి లక్ష్మీ సునీత మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని ముందుగా గణిత శాస్త్రంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. గణిత శాస్త్రంలో జామెట్రీ, ట్రిగ్నామెట్రీ,ఆల్జీబ్రా, మెజర్మెంట్స్,ఫ్యాక్టర్స్, నంబర్ సిస్టం లాంటి అంశాలు ఉంటాయని తెలిపారు. వీటిపై సులభతరంగా చేసే పద్ధతులు, విధానాలు ఈ సదస్సులో తెలియజేశామని తెలిపారు. ఈ సదస్సులో సుమారు 30 గణిత నమూనాలు ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించామని తెలిపారు. గణిత శాస్త్రం ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ గణితం పై పట్టు సాధించిన వారు ఏ శాస్త్రం పైన అయినా పట్టు సాధిస్తారని తెలిపారు. సులభంగా మాథ్స్ సాధన చేసే పద్ధతులు తెలిపారు. విద్యార్థులకు ఇలా నమూనాలు ద్వారా ప్రాక్టికల్ గా చూపించడం వలన ఆ సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుందని, దానిపై భయం పోతుందని, వారు సొంతగా సాధన చేయటానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఇలా నమూనాలు ఏర్పాటుచేసిన గణిత శాస్త్ర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాథ్స్ టీచర్స్ శ్రీనివాసరావు, లక్ష్మణరావు, యశోదర, నరసింహారావు,నిర్మల, నాగలక్ష్మి పాల్గొన్నారు. (Story : గణిత శాస్త్ర అవగాహన సదస్సు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version