ప్రభుత్వమే సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికసంఘాల(JAC) జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి బొబ్బిలి నిక్సన్ తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘo(CITU)జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా తెలంగాణ ప్రగతి శీల భవన ఇతర నిర్మాణకార్మిక సంఘo(IFTU)రాష్ట్ర సహాయ కార్యదర్శి C రాజు,,మరియు తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘo గౌరవ అధ్యక్షులు పుట్ట ఆంజినేయులు,భవన నిర్మాణ కార్మిక సంఘo(AITUC)జిల్లా నాయకులు రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు లో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీ లకు ఇవ్వవద్దు అని ప్రభుత్వంమే సంక్షేమ బోర్డు ద్వారా ఎప్పటి లాగానే సంక్షేమ పథకాలు అందిచలని కార్మికుల యొక్క సేస్సు డబ్బులను కార్మికుల కొరకు ఖర్చు చేయాలనీ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ బోర్డు సంక్షేమ పథకాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడని ఆపాలని సెప్టెంబర్ 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమానికి తాపీ మేస్త్రి లు, వడ్రంగి, ఎలక్ట్రికల్ వర్కర్స్, పెయింటర్స్, సంట్రింగ్ మేస్త్రి లు, నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సెప్టెంబర్ 23న చలో హైదరాబాద్ రాష్ట్ర సంక్షేమ బోర్డు కార్యాలయం ముందు జరిగే ధర్నాకు నిర్మాణ రంగా కార్మికులు ఎక్కువ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో CITU జిల్లా అధ్యక్షులు M రాజు, AITUC జిల్లా సహాయ కార్యదర్శి గోపాల కృష్ణ, IFTU జిల్లా నాయకులు గణేష్, తెలంగాణ భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘo జిల్లా ఉపాధ్యక్షులు వెంకటయ్య,రాములు లు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వమే సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అందించాలి)