విద్యార్ధుల వితరణ భేష్
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : వరద బాధితులను ఆదుకొనేందుకు విద్యార్ధులు చూపించిన చొరవను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభినందించారు. నెల్లిమర్ల మండలం జరజాపేట జిల్లాపరిషత్ విద్యార్ధులు, విజయవాడ వరద బాధితుల కోసం తమవంతు చిరు సాయం అందించడంతోపాటు, పలువురి దగ్గరనుంచి విరాళాలను సేకరించారు. పాఠశాలలో ఉన్న సుమారు 200 మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వీరు సేకరించిన మొత్తం రూ.22,000 ను, జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌కు డిడి ద్వారా శుక్రవారం సాయంత్రం అందజేశారు. విద్యార్ధులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్, జెడ్‌పి స్కూల్ హెడ్‌మాష్టర్ వడ్డా ఆదినారాయణ పాల్గొన్నారు. (Story : విద్యార్ధుల వితరణ భేష్)