కమ్యూనిస్టు పోరాట యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి కి ఘనమైన నివాళులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి దేశానికి తీరనిలోటని మన దేశంలోని కమ్యూనిస్టు అభిమానులకు పేద ప్రజలకు కార్మికులు కష్టజీవులకు తీవ్రమైన దిగ్బ్రాంతికి గురిచేసిందని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. గురువారం నాడు ఆయన మరణ వార్త తెలిసిన కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఎర్రజెండా అభిమానులు అందరూ కూడా శోక తప్త హృదయాలతో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశం ఒక ఆదర్శప్రాయుడిని సమ సమాజ వ్యవస్థ కోసం పాటుపడే నిఖార్సైన కమ్యూనిస్టుని కోల్పోయిందని ప్రస్తుతం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, నిరంకుశ, ప్రైవేటీకరణ, కార్పొరేటీ కిరణ విధానాలు పట్ల తీవ్రంగా వ్యతిరేకించే మంచి మనిషిని కోల్పోయామని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ , ప్రజాస్వామ్య పరిరక్షణ, కమ్యూనిస్టు ఆశయాల సాధన కొరకు పాటుపడే కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలు కొనసాగించుటకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని ఆయన కోరారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, సండ్రపాటి సైదా, పఠాన్ లాల్ ఖాన్, యార్లగడ్డ చంద్ర శేఖర్ అజాద్, షేక్ కిషోర్, కే మల్లికార్జున, పవన్ కుమార్, షేక్ మస్తాన్, తదితరులు పాల్గొన్నారు. (Story : కమ్యూనిస్టు పోరాట యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి కి ఘనమైన నివాళులు)