ఉత్కంఠభరితంగా కొనసాగిన అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఆర్డిటి మైదానంలో ఎనిమిదవ రోజు కూడా అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి.
మొదటి మ్యాచ్ గొట్లూర్ టీం కి సంపేట్ల టీం మధ్య జరిగిన మ్యాచ్లో దంపేట్ల టీం మీద గొట్లుర్ టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
రెండవ మ్యాచ్ మేడపురం కింగ్స్ టీం కి రోద్దం టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో రోద్దం టీం మీద మేడపురం కింగ్స్ టీం 62 పరుగుల తేడాతో గెలుపొందింది.
మూడవ మ్యాచ్ మేడపురం కింగ్స్ టీం కి గోట్లుర్ టీం మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో గోట్లుర్ టీం మీద మేడపురం కింగ్స్ టీం 6 పరుగుల తేడాతో గెలుపొందింది.
నాలుగవ మ్యాచ్ ఫాయాజ్ టీం కి ఎంజి వారియర్స్ టీం కి మధ్య జరిగిన మ్యాచ్లో ఎంజి వారియర్స్ టీం మీద ఫాయాజ్ టీం 28 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఐదవ మ్యాచ్ ఫాయాజ్ టీం కి స్టార్ 11 టీం కి మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఫాయాజ్ టీం మీద స్టార్ 11 టీం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ 5 మ్యాచుల్లో తమ ప్రతిభను చూపిన గోట్లూరు టీం వీరు జెఆర్, మేడపురం కింగ్స్ టీం ఎం. సమర, నరేష్, ఫాయాజ్ టీం హుస్సేన్, స్టార్ 11 టీం బాబ్జన్ అనే ఐదుగురు ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్, మంత్రి పిఏ మల్లికార్జున, మిర్యాల అంజి, తదితరులు పాల్గొన్నారు. (Story : ఉత్కంఠభరితంగా కొనసాగిన అటల్ బిహారి వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు)