UA-35385725-1 UA-35385725-1

అక్టోబర్ 31న  ‘బఘీర’ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

అక్టోబర్ 31న  ‘బఘీర’ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: రోరింగ్ స్టార్ శ్రీమురళి కథానాయకుడిగా కె.జి.యఫ్, కాంతార, సలార్ వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బఘీర’. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి క‌థ‌ను అందించారు. హోంబ‌లే ఫిలిమ్స్ మేకింగ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాంటి పెస్ట్రీజియ‌స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ రూపొందిస్తోన్న ఈ మూవీ తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 31న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

బ‌ఘీర రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అందులో ఓ మాస్క్‌ను చూపిస్తున్నారు. డిఫ‌రెంట్ లుక్లో ఉన్న ఈ మాస్క్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘బఘీర’ మూవీ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచాయి. శ్రీముర‌ళి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో అల‌రించ‌బోతున్నారు. ఎ.జె.శెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బి.అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

న‌టీన‌టులు:

శ్రీముర‌ళి, రుక్మిణి వ‌సంత్, ప్ర‌కాష్ రాజ్‌, రంగ‌యాణ ర‌ఘు, అచ్యుత్ కుమార్‌, గ‌రుడ రామ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  హోంబ‌లే ఫిలిమ్స్‌, నిర్మాత:  విజ‌య్ కిర‌గందూర్‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్‌:  డాక్ట‌ర్ సూరి, సినిమాటోగ్ర‌పీ: ఎ.జె.శెట్టి, మ్యూజిక్‌:  బి.అజ‌నీష్ లోకనాథ్‌, ఎడిట‌ర్‌:  ప్ర‌ణవ్ శ్రీప్ర‌సాద్‌, యాక్ష‌న్‌:  చేత‌న్ డిసౌజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  యోగి జి.రాజ్‌, అభిజీత్, ఆర్ట్‌: ర‌వి, కాస్ట్యూమ్స్‌:  యోగి.జి.రాజ్‌, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా. (Story : అక్టోబర్ 31న  ‘బఘీర’ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1