కొత్తపేట ఆరో వార్డు లో గణేష్ ఉత్సవాలు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక కొత్తపేట ఆరో వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆరో వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరావు అండ్ బ్రదర్స్ మరియు దాతల సహాయ సహకారాలతో గత 19వ సంవత్సరలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు వారి తెలిపారు. బుధవారం ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు మహాగణపతి హోమం, మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, సాయంత్రం ఐదు గంటలకు లక్కి డీప్ ద్వారా గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం, తదుపరి స్వామివారి లడ్డు వేలం పాట జరిపి అనంతరం స్వామివారిని భారీ విద్యుత్ అలంకరణలతో, మేళతారాలతో భారీ ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. (Story : కొత్తపేట ఆరో వార్డు లో గణేష్ ఉత్సవాలు)