ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐ.డి. ఓ.సి ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం కలక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటం పై నిర్లక్ష్యం వహించారాదని, ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదు దారునికి సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి)
