UA-35385725-1 UA-35385725-1

గృహ నిర్మాణ 100 రోజుల లక్ష్యాల పూర్తిపై దృష్టిపెట్టండి

గృహ నిర్మాణ 100 రోజుల లక్ష్యాల పూర్తిపై దృష్టిపెట్టండి

– మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలి

– వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహ నిర్మాణ అధికారులు సిబ్బంది సేవలు భేష్

– రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

న్యూస్‌తెలుగు/విజయవాడ :  పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన వందరోజుల ప్రణాళిక లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఆదేశించారు.
గృహ నిర్మాణ పనుల పురోగతిపై ఆదివారం మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రగతిపై సమీక్షించారు. వందరోజుల ప్రణాళిక కింద నిర్దేశించిన లక్ష్యాలు, వాటి సాధనలో పురోగతిని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (గృహ నిర్మాణం) అజయ్ జైన్ వివరించారు. అదేవిధంగా మొత్తం మంజూరైన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను ఏపీ ఎస్ హెచ్ సి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజాబాబు వివరించగా.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన వివరాలను ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ…. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని ఈ నేపథ్యంలో అధికారులు చొరవ చూపాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా దాదాపు ఏడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని.. మిగిలిన ఇళ్లను 2025, మార్చినాటికి పూర్తి చేసేందుకు కృషిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు క్షేత్రస్థాయిలో సందర్శించి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేయాలి అన్నారు. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి పనుల్లో జాప్యం లేకుండా చేయాలన్నారు. లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో చేయిపట్టి నడిపించాలన్నారు. అదేవిధంగా కాలనీల్లో మౌలిక వసతులు కల్పనపై కూడా దృష్టిసారించి మంజూరు చేసిన పనుల పూర్తికి ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రహదారుల ఏర్పాటుకు సంబంధించి పంచాయతీరాజ్ అధికారులతోనూ, మంచినీటి సరఫరాకు సంబంధించి గ్రామీణ నీటి సరఫరా అధికారులతోనూ కలిసి పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జల జీవవ్ మిషన్ కింద మంజూరు చేసిన పనులను పూర్తిచేయాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అమృత్ పథకం కింద పనులు చేపట్టేలా పురపాలక సంఘ అధికారులతోనూ సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వాటి ప్రభావం లేని పనుల పూర్తికి కృషిచేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో భాగస్వామ్యం అవుతున్న గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి పార్థసారథి ప్రశంసించారు. (Story :గృహ నిర్మాణ 100 రోజుల లక్ష్యాల పూర్తిపై దృష్టిపెట్టండి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1