ఎర్రజోడు లక్ష్మి మృతి బాధాకరం.. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులు.
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా):పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన చేనేత నాయకులు ఎర్ర జోడు లోకేష్ ,చంద్ర లా తల్లి ఎర్రజోడు లక్ష్మీదేవి మృతి బాధాకరమని, వారి మృతి తీరని లోటు అని ఆరోగ్య శాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులు, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత రంగంలో 50 సంవత్సరాలుగా ఎంతోమంది కార్మికులకు ఉపాధిని కల్పించిన మహోన్నతమైన సేవకురాలు అని వారు తెలిపారు. అనంతరం భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీనివాస్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, మిరియాల అంజి తదితరులు పాల్గొన్నారు.(Story:ఎర్రజోడు లక్ష్మి మృతి బాధాకరం.. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులు.)