వరద బాధితులకు బెడ్షీట్లు పంపిణీ
ధర్మవరం స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గత కొన్ని రోజుల కిందట విజయవాడ వరద రావడంతో ఊహించలేని పరిస్థితి, ప్రజలకు సహాయం, దిక్కులేని స్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ తనవంతుగా విజయవాడకు నేరుగా వెళ్లి ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు 3000 బెడ్ సీట్లను పంపిణీ చేశారు. డాక్టర్ బషీర్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడం నాడు ప్రజలందరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వము కూడా ఎన్నో రకాలుగా వరద బాధితులను ఆదుకోవడం జరుగుతోందని తెలిపారు. అతి త్వరలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ద్వారా కూడా వరద బాధితులకు సహకారం తీసుకుంటామని తెలిపారు. నా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డిజిస్టర్ మేనేజ్మెంట్ ఐజి మురళీమోహన్, హెల్త్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్ లు ఎంతో సహకారం అందించారని తెలిపారు. వీరందరికీ మా స్పందన ఆస్పటల్ డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా లు ప్రత్యేక కృతజ్ఞతలను వారు తెలియజేశారు. అదేవిధంగా హోం మంత్రి అనిత అని కూడా కలవడం జరిగిందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని వారు తెలిపారు. (Story : వరద బాధితులకు బెడ్షీట్లు పంపిణీ )