సాయుధ రైతాంగ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేనని సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ కార్యదర్శి జే. రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కళావతమ్మ అన్నారు. ఆదివారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో ఎర్రకురుమయ్య అధ్యక్షతన పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలలో ‘బాంచన్ ని కాల్మొక్త’అనే సామాన్య ప్రజలను గ్రామ గ్రామాన చైతన్యం చేసి పోరాట వీరులుగా తీర్చిదిద్దింది కమ్యూనిస్టులేన్నారు. ఆ పోరాటానికి నాయకత్వం వహించింది కూడా కమ్యూనిస్టు లేనన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణను విముక్తం చేసి, దేశంలో దేశంలో విలీనానికి కృషి చేసింది కమ్యూనిస్టులు అని స్పష్టం చేశారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందన్నారు. దాన్ని బిజెపి హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించే కుట్ర చేస్తుందని, తిప్పి కొట్టాలన్నారు. విలీనం, విమోచనం, విద్రోహం ఏ పేర్లతో నిజాం, నిజాం తాబేదారులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు వీరు లేనన్నారు. విలీనం, విద్రోహం, విమోచనం పేరు ఏదైనా పోరాడింది ప్రజలను నిజాం నుంచి రక్షించింది కమ్యూనిస్టు పార్టీలేనని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరును వక్రీకరించే కుట్రలను తిప్పికొట్టేందుకు, సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి 17వ తేదీ వరకు పోరాట వారోత్సవాలకు సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందని జిల్లాలో విజయవంతం చేయాలని కోరారు. పి కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్, భారత జాతీయ మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షులు జయమ్మ, ఎర్రకురుమన్న, చిన్న కురుమన్న, విష్ణు తదితరులు పాల్గొన్నారు. (Story : సాయుధ రైతాంగ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే : సిపిఐ)