UA-35385725-1 UA-35385725-1

‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ ట్రైలర్ రిలీజ్

‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ ట్రైలర్ రిలీజ్

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 20 నుంచి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా:  అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్”. హాట్ స్టార్ స్పెషల్స్ గా ఈ సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ కు అనిష్ యెహాన్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” సిరీస్ ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

“ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – నికోబార్ ఐల్యాండ్స్ లో ఉన్న ప్రైవేట్ ఐల్యాండ్ మోక్ష ను విజిట్ చేసేందుకు వెళ్తారు ఆ ఐల్యాండ్ వారసులు. మోక్ష ఐల్యాండ్ లోని ప్రతి జీవాన్ని, ప్రతి మార్గాన్ని డాక్టర్ విశ్వక్ సేన్ సృష్టిస్తాడు. అతనికి ప్రతిబింబం లాంటిదే ఈ ఐల్యాండ్. అలాంటి దీవిలోకి అడుగుపెట్టిన వారసులకు అనూహ్యమైన ఘటనలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వీరి హత్యలకు కారణం ఏంటి ?, అందమైన మోక్ష దీవిలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరు సృష్టిస్తున్నారు ?. వారసులనే ఎందుకు టార్గెట్ చేశారు ? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. “ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” సిరీస్ పై కావాల్సినంత క్యూరియాసిటీని ట్రైలర్ క్రియేట్ చేస్తోంది.

నటీనటులు – అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మడివాడ, పావని రెడ్డి, సుధ, భాను చందర్, రాజ్ తిరందాసు, అజయ్ కతుర్వార్, అక్షర గౌడ, తదితరులు (Story : ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ ట్రైలర్ రిలీజ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1