లీడర్స్ వీక్‌తో కలిసి టీచ్ ఫర్ ఇండియా టీచర్స్‌డే
హైదరాబాద్: ఉపాధ్యాయులను స్మరించుకునేలా, బాలల్లో విద్యా సమానత్వం కోసం పనిచేస్తున్న టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్‌ని నిర్వహించింది. భారతదేశం వ్యాప్తంగా తక్కువ ఆదాయాన్ని గడిస్తున్న సముదాయాలలోని విద్యార్థులను ప్రేరేపించి, సాధికారత కలిపంచేందుకు విభిన్న రంగాలకు చెందిన 200 మంది ప్రభావవంతమైన వ్యక్తులను ఈ కార్యక్రమం ఒక్క చోటుకు చేర్చింది. నారాయణ్ మూర్తి, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో యంగ్ గ్లోబల్ లీడర్ డాక్టర్ రితేష్ మాలిక్, ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, బోర్డ్ మెంబర్ ఆదిత్య ఘోష్, మేక్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు, సీఈఓ దీప్ కల్రా, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్ చౌదరి, పేయూ సీటీఓ నరేంద్ర బాబు, ఎన్‌డీటీవీలో మాజీ ఎడిటర్ సోనియా సింగ్, ఐఆర్‌ఎస్ అధికారిణి సుసాన్ థామస్, ఏఐ అడ్వైజరీ క్లౌడ్ టీసీఎస్ మరియు కన్సల్టింగ్ గ్లోబల్ హెడ్, వంటల ప్రభావశీలి క్రిష్ అశోక్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన సంజనా సాగి, లక్ష్మి మంచు, వరుణ్ గ్రోవర్, కేతకి మాతేగాంకర్ వంటి ప్రముఖులు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢల్లీి, హైదరాబాద్, ముంబయి, పుణె, కోల్‌కతాలోని టీచ్ ఫర్ ఇండియా తరగతి గదులను సందర్శించారు. (Story : లీడర్స్ వీక్‌తో కలిసి టీచ్ ఫర్ ఇండియా టీచర్స్‌డే)