సత్య కళాశాలలో కెరీర్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై సెమినార్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సత్య డిగ్రీ& పీజీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులకు కెరీర్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై సెమినార్ ను ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ ప్రైవేటు లిమిటెడ్ డైరక్టర్ సౌమ్యదిప్ చక్రబొర్తి తో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు క్రొత్తగా వస్తున్న టెక్నాలజీలు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్సు 6జి లాంటి కమ్యూనికేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో విద్యార్థులు కెరీర్ మార్గాలను ఎలా రూపొందించాలో వివరించి ఉద్యోగ అవకాశాల కోసం తెలిపారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే విషయాలను వివరించారు.గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ లో పోటీ తత్వం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అనుకూలంగా మారటానికి అవసరమైన నైపుణ్యాలను మౌలికంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.ఈ సెమినార్ విద్యార్థులకు భవిష్యత్తు లో వున్న అవకాశాలను అవగాహన చేసుకోవడానికి, సమర్ధతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అని కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు అన్నారు.
ఈ కార్య్రమంలో ఇన్విక్టా డైరక్టర్ కృష్ణ మోహన్ , ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సత్య కళాశాలలో కెరీర్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై సెమినార్ )