మట్టి విగ్రహాలను పూజిద్దాం. జిల్లా కలెక్టర్.
న్యూస్ తెలుగు /ములుగు :మట్టి విగ్రహాలను పూజించడంవల్ల,పర్యావరణ ను పరిరక్షించడంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించి భవిష్యత్ తరానికి మంచి వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రజలను కోరారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తన ఛాంబర్స్‌లో బాల సదనం బాలికలకు, అంగన్‌వాడీ టీచర్లకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ గణేష్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆశీర్వాదం ఉండాలన్నారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనక విగ్రహాలతో వాతావరణ కాలుష్యంతో చిన్న వయసులోనే క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, వ్యాధులు వస్తున్నందున ప్రజలు ఇప్పటినుండి మార్పులు చేపట్టి భవిష్యత్ తరానికి మంచి వాతావరణం అందించాలని అన్నారు. మట్టి వినాయకులు పెడితే ఆశీర్వాదం పుణ్యం ఎక్కువ ఉంటుందని, అందరూ మట్టి వినాయకులు పెట్టాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో స్వర్ణ లత లెనినా, సీడీపీఓ శిరీష, సూపర్‌వైజర్ కావ్య, చిల్డ్రన్స్ హోం సూపరింటెండెంట్ సుమతి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిణి కృష్ణవేణి, ఏవోటీలు, చిల్డ్రన్‌హోమ్ బాలికలు పాల్గొన్నారు.(Story:మట్టి విగ్రహాలను పూజిద్దాం. జిల్లా కలెక్టర్.)