ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
న్యూస్‌తెలుగు/వినుకొండ : రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో శుక్రవారం జాషువా కళా ప్రాంగణ ఆవరణలో నియోజకవర్గం లోని 12 మంది ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఆలా శ్రీనివాసరావు వహించగా ముఖ్య అతిథులుగా వచ్చిన మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ రాష్ట్రంలోని మహోన్నతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు ముందంజలో ఉందని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయులు ఈ.వెంకట్ రెడ్డి, టి.మల్లికార్జున, జి. నాగేంద్రుడు, ఏ. లలితా కుమారి దంపతులను ఘనంగా దృశ్యాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, సెక్రటరీ ఏరువా వెంకటనారాయణ, కోశాధికారి ఎస్కే మస్తాన్, మాజీ అధ్యక్షులు చిరుమామిళ్ల కోటేశ్వరరావు, కూచి రామాంజనేయులు, బివి నాగేశ్వరరావు, గుత్తా గురునాథం, రుసుం రాజారెడ్డి, ముప్పాళ్ళ రమేష్, బిజ్జం వెంకటేశ్వర రెడ్డి, సాదినేని శ్రీనివాసరావు, దావులూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం)