క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు ఎంతో అవసరం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు ఎంతో అవసరమని, ఆ క్రమశిక్షణ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాన్ని పొందగలిగే అవకాశం ఉందని ముఖ్య అతిథులు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సత్య కృప మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయులు విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో; పట్టణంలోని రేగడిపల్లి రోడ్డు లో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో చైర్మన్ చిన్నపరెడ్డి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించుకున్నారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితాన్ని మలచగలిగే ఏకైక వ్యక్తి అధ్యాపకుడే అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ అద్యాపకులు హాజీవలి హాజరై విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు. కళాశాల లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతిభను వెలికి తీసి నానబెట్టిన ఉపాధ్యాయులది ఆ ఘనత అని వారు తెలిపారు. తదుపరి అధ్యాపకున్ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ హర్షవర్ధన్, ఏవో. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో: పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నడుమ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహిస్తూ ముఖ్య అతిథిగా పూర్వపు ఉపన్యాసకులు కృష్ణయ్య టీచర్స్ డే యొక్క ప్రాధాన్యతను వివరించారు. తదుపరి కృష్ణయ్యను ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో;; పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రిన్సిపాల్ ఫణి కుమార్, కళాశాల కరెస్పాండెంట్ చాంద్ బాషా లు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : క్రమశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు ఎంతో అవసరం)