వినుకొండలో పౌష్టిక హార వారోత్సవాలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : పౌష్టిక హారం వారోత్సవాలు వినుకొండలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కొత్తపేట 1 సచివాలయం అంగన్ వాడి సెంటర్లో పౌష్టిక ఆహారం మహోత్సవాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈనెల ఒకటో తారీకు నుండి ఈ నెల 30 తారీకు వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని అంగనవాడి సెంటర్ నందు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ అనురాధ సూపర్వైజర్ కే శ్రీలత పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహారంలోని పోషక విలువలు గురించి వివరించారు. నేటి మహిళలు, తల్లులు మునగాకు, గోంగూర మొదలగు ఆకుకూరలు లో ఉన్న పోషక విలువలు గురించి వివరించారు. అలానే చిరుధాన్యాలు, పాలు, గుడ్లు ప్రభుత్వం అందజేసే బాలామృతంతో వంటలు ఎలా చేసుకోవాలో వివరించారు. అనంతరం గ్రామంలో వీధుల నందు వారోత్సవాల ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు చేసిన వంటకాలు అందరికీ పంచిపెట్టి వంట ఎలా చేసుకోవాలో వివరించారు. తల్లులకు అనీమియా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఏం అనురాధ, సూపర్వైజర్ కే. శ్రీలత, అంగన్వాడీ కార్యకర్తలు పి ఉమా శంకరి, వి. అరుణ, బి. నిర్మలా, బి.జ్యోతి, బి.నాగమణి, కే.సునీత, తదితరులు పాల్గొన్నారు. (Story : వినుకొండలో పౌష్టిక హార వారోత్సవాలు)