Homeటాప్‌స్టోరీ'పోలీసువారి హెచ్చ‌రిక' ఫ‌స్ట్‌లుక్ అదుర్స్‌!

‘పోలీసువారి హెచ్చ‌రిక’ ఫ‌స్ట్‌లుక్ అదుర్స్‌!

“పోలీస్ వారి హెచ్చరిక” ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు..!
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “” టైటిల్ ఎంత ఆకర్షణీయం గా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని, ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారని, కానీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక పోలీస్ ను తుపాకులతో కట్టి బంధించడం నిజంగా కొత్తగా ఉందని , ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని ” ఉద్ఘాటించారు..!! “” సినీ పరిశ్రమలో నేను అన్నయ్య అని పిలిచేది హీరో
శ్రీకాంత్ గారిని మాత్రమేనని, మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను
విడుదల గావించుకున్న మా “” పోలీస్ వారి హెచ్చరిక “” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని “” దర్శకుడు బాబ్జీ అన్నారు..!!
నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “” ఎప్పటికైనా హీరో శ్రీకాంత్ గారితో ఒక ఫోటో దిగాలనుకున్నాను , అటువంటిది యీ రోజు నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నే ఆయన ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం “” అన్నారు..! ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్ ,
నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్ , హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు..!
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న యీ చిత్రంలో సన్నీ అఖిల్ , గిడ్డేష్ , అజయ్ ఘోష్ , రవి కాలే , షియాజీ షిండే , శుభలేఖ సుధాకర్ , కాశీ విశ్వనాథ్ , జబర్దస్త్ వినోద్ , జబర్దస్త్ పవన్ , హిమజ , జయ వాహిని , మేఘనా ఖుషి, శంకరాభరణం తులసి తదితరులు యీ చిత్ర తారాగణం ..!
సంగీతం : గజ్వేల్ వేణు, కెమెరా : కిషన్ సాగర్ ,
కె. నళినీ కాంత్
ఎడిటింగ్ : శివ శర్వాణి
ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ : యస్ . హనుమంత రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్ . పి . సుబ్బారాయుడు
నిర్మాత : బెల్లి జనార్థన్
రచన , దర్శకత్వం : బాబ్జీ (Story: ‘పోలీసువారి హెచ్చ‌రిక’ ఫ‌స్ట్‌లుక్ అదుర్స్‌!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!