Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రాచీన కళలను కాపాడుకుందాం 

ప్రాచీన కళలను కాపాడుకుందాం 

0

ప్రాచీన కళలను కాపాడుకుందాం 

యువతకు ప్రాధాన్యత ఇద్దాం

రాష్ట్ర విద్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్..

న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :
ప్రాచీన కలలను కాపాడుకుందాం – యువతకు ప్రాధాన్యత ఇద్దాం అని ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర విద్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మ
‘ శిల్ప గురు ‘ జాతీయ అవార్డుకు ఎంపికైంది.కేంద్ర ప్రభుత్వం అందించే ‘శిల్ప గురు’ జాతీయ అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ శివమ్మ,తోలుపై అద్భుతంగా రూపొందించిన శ్రీకృష్ణచరిత,ఏడు అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండాలను కేంద్ర జౌళి శాఖ నిర్వహించే శిల్పగురు,జాతీయ చేతివృత్తుల అవార్డు 2023 పోటీలకు పంపగా,ఈ అవార్డు ఆమెకు దక్కడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు శివమ్మకు ఈ అవార్డు అందడం తోలుబొమ్మల కళాకారులకు,ముఖ్యంగా రాయలసీమ కళాకారులకు గర్వకారణమని తెలిపారు.ఇలాంటి కళలను కాపాడుకునేందుకు ఆమె చేస్తున్న సేవలను అభినందిస్తూ శివమ్మ లాంటి వారి స్ఫూర్తితో యువత ప్రాచీన కళలను కాపాడుకునే చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. (Story : ప్రాచీన కళలను కాపాడుకుందాం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version