UA-35385725-1 UA-35385725-1

కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం

కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం

✒️ అందుకే రైతులకు, ప్రజలకు తీవ్ర నష్టం

✒️ నష్టపోయిన ప్రతికుటుంబాన్ని, రైతులను ఆదుకుంటాం

✒️ ఇసుక మేట వేసి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

✒️ ఇండ్లుకోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తాం

✍️ కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

👉 రెండో రోజు అధికారులతో కలిసి పాల్వంచ మున్సిపాలిటీ, గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే

👉 ప్రజాక్షేత్రంలోనే ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు

👉 ముంపుబాధితులకు భరోసాకల్పిస్తూ ఏజెన్సీ గ్రామాల్లో, మున్సిపాలిటీ వార్డులలో విస్తృత పర్యటన

న్యూస్ తెలుగు/ భద్రాద్రి కొత్తగూడెం: కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారుల ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోనే వందలాది ఎకరాల పంట భూములు నీట మునిగాయని, అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం రెండో రోజు అధికారులతో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని హమాలీ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, తదితర లోతట్టు ప్రాంతాలు, మండల పరిధిలోని బసవతారక కాలనీ సోములగూడెం, రంగాపురం, నాగారం కాలనీ, నాగారం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అధికార యంత్రాంగం అంతా తక్షణమే నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు సందర్శించిన సందర్భంలో దెబ్బతిన్న రోడ్లను, విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు సమాచారం అందించినప్పటికి సందర్శనకు గైర్జనరైన వివిధ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణపనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వేచేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. పాల్వంచ పట్టణ, మండల జరిగిన ముంపు పరిస్థితులను గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నష్టపోయిన ప్రతికుటుంబాన్ని, రైతులను, ఇసుక మేట వేసి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఇండ్లుకోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాధం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి, సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, డి సుధాకర్, కాంగ్రెస్ నాయకులు అయితా గంగాధర్, తహశీల్దార్ వివేక్, ఎంపిడీవో కె. విజయభాస్కర్, మున్సిపల్ కమిషనర్ డాకు నాయక్, ఎంపీవో బి.నారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారి దేవదాస్, చంద్రశేఖర్, రాథోడ్, విద్యత్ శాఖ డీఈ నందయ్య, ఏఈ రవీందర్, పిఆర్డీఈ రామకృష్ణ, ఆర్అండ్ అధికారి డి. నాగేశ్వర్రావు, వ్యవసాయ శఋఖ అధికారి శంభోశంకర, శౠంతి, అటవీశాఖ అధికారి కృష్ణయ్య, సీపీఐ నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, వైస్. గిరి, SA. రహిమాన్, కరీం, Sk. కాసిం, వల్లపు యాకయ్య, కొంగర అప్పారావు, లాల్ పాషా, మాజీ సర్పంచులు బాదావత్ శ్రీను, బుక్య విజయ్, మాలోత్ హరి, మాజీ ఎంపీటీసీ మోహన్ రావు, బాణాత్ రంజిత్, రామకృష్ణ, వేములపల్లి రాజశేఖర్ రవీందర్, ఆదినారాయణ, జర్పుల మోహన్, రంగారావు, వీరన్న, వెంకటరమణ, చంచల్పురి శీను, సాయిలు శీను, ప్రేమ్ కుమార్, ఎరుకుల వెంకటేశ్వర్లు, బాదావత్ శీను, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. (Story: కిన్నెరసాని ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1