సత్య కళాశాలలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
న్యూస్‌తెలుగు/విజయనగరం: సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విభాగాల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హిత మట్టి, పంచగవ్య గణపతి విగ్రహాల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజలకు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, అందుకే మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అవగాహన కల్పించడానికి విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మట్టి గణపతి విగ్రహాలను వినాయక చవితి రోజు పూజించాలని అందరి కి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయిదేవ మణి మాట్లాడుతూ అందరూ పర్యావరణాన్ని, జల చరాలను కాపాడటం తమ సామాజిక బాధ్యత గా భావించి మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ ఎం సత్య వేణి, ఎన్ సి సి ఆఫీసర్ బి. సూరపు నాయుడు, అధ్యాపకులు, ఎన్ సి సి కేడేట్స్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. (Story: సత్య కళాశాలలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ)