UA-35385725-1 UA-35385725-1

మెనూ అమలుపై దృష్టి పెట్టాలి

మెనూ అమలుపై దృష్టి పెట్టాలి

రుచిగా మాత్రమే కాదు పోషకాలు కూడా ఉండేలా చూడాలి

స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు నిత్యం తనిఖీ చేయాలి – జిల్లా కలెక్టర్

మధ్యాహ్న భోజన పధకంపై అవగాహనా సదస్సు

న్యూస్ తెలుగు/విజ‌య‌న‌గ‌రం: విజయనగరం పాఠశాలల్లో విద్యార్ధులకు పెట్టే మద్యాహ్న భోజనం రుచిగాను, పోషక విలువలతో కూదినదిగానూ ఉండాలని అందుకోసం మెనూ ఎలా ఉంటె బాగుంటుందో చర్చించి ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నడొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం పై ఎం.ఈ.ఓ లకు, పాఠశాల నిర్వహణా కమిటీలకు, హెచ్.ఎం లకు, భోజన నిర్వాహకులకు కలెక్టరేట్ ఆడిటోరియం లో మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల వారీగా మెనూ తయారు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని , మన జిల్లా కు సరిపోయే మెనూ ను రూపొందించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పిల్లలు కడుపు నిండితే ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉంటె చదువు పై దృష్టి పెడతారని, అందరి అభిప్రాయం తో కొత్త మెనూను తయారు చేయాలనీ, పిల్లలు ఇష్టంగా తినేవి, ఆరోగ్యాన్ని పెంపుదల చేసేవి మెనూ లో ఉండాలని తెలిపారు. మద్యాహ్న భోజనం లో 16 రకాల వంటకాలను అందజేయడం జరుగుతోందని, వారం లో 5 రోజుల పాటు గుడ్డు పెడుతున్నామని , 3 రోజులు వేరుసెనగ చిక్కీ లను , 3 రోజులు రాగి జావ ను ఇస్తున్నామని వీటిని కొనసాగిస్తూనే ఇంకా పోషకాలతో కూడిన ఆహారాన్ని మెనూ లో చేర్చాలని తెలిపారు. 5 రోజులు గుడ్డు ఇస్తున్నప్పటికీ ఒక్క రోజే కూర రూపం లో , మిగిలిన 4 రోజులు ఉడకబెట్టిన గుడ్డు ను ఇస్తున్నామని, అలా కాకుండా 3 రోజులు కూర రూపం లో ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారని పలువురు వంట నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వసతి గృహాలకు ఇచ్చే బియ్యం మంచి వెరైటీ సరఫరా చెయ్యాలని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ వారికీ ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాధమిక విద్యార్ధులకు ప్రస్తుతం ఇస్తున్న 100 గ్రాముల బియ్యం సరిపడడం లేదని , 150 గ్రాములు ఇస్తే కడుపు నిండా తింటారని నిర్వాహకులు తెలిపారు. కుకింగ్ చార్జీలు పెంచాలని నిర్వాహకులు కోరారు. పెంపుదల విషయం ప్రభుత్వ పరిశీలన లో ఉందని కలెక్టర్ తెలిపారు. పప్పు, నూనె ప్రభుత్వమే సరఫరా చేస్తే బాగుంటుందని హెచ్.ఎం. లు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.

వంట గదులు, వంట పాత్రలు పరిశుభ్రంగా ఉంచాలని, కట్టెల పొయ్యి మీద వంట చేయవద్దని కలెక్టర్ సూచించారు. ఎన్ని సిలెండర్లు కావాలన్నా ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే వెంటనే తీసుకోవాలని హెచ్.ఎం. లకు తెలిపారు. స్కూల్ మానేజ్మెంట్ కమిటీలు మధ్యాహ్న భోజన పధకాన్ని నిత్యం తనిఖీ చేయాలని, అప్పుడే వంట వారు బాగా వంట చేస్తారని, వడ్డించే వారు బాగా వడ్డిస్తారని, ఈ పధకం ఉద్దేశ్యం నెరవేరుతుందని తెలిపారు.

ఈ సమావేశం లోజిల్ల విద్యా శాఖాధికారి ఎన్. ప్రేమ్ కుమార్, ఎ.డి లు, డిప్యూటీ డి.ఈ.ఓ లు తదితరులు పాల్గొన్నారు. (Story: మెనూ అమలుపై దృష్టి పెట్టాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1