అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం
న్యూస్‌తెలుగు/తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి అత్యంత ప్రియమైన గరుడసేవ రోజున భారీగా విచ్చేసే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అక్టోబరు 8న టీటీడీ రెండు ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది.
ఈ సంవత్సరం తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 8న ముఖ్యమైన గరుడ సేవ నిర్వహించనున్నారు. కాబట్టి అక్టోబర్ 7న రాత్రి 9 గంటల నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతోంది. (Story: అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం)