Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నేటి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు

నేటి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు

0

నేటి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు

జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

న్యూస్ తెలుగు /ములుగు : సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని భారీ వర్షాల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు ,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, ఎలాంటి ఇబ్బందులు కలగవద్దు అనే ఉద్దేశంతో పాటు
జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యలలో నిమగ్నం అయినందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇట్టి విషయాన్ని గమనించి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు కలెక్టరేట్ కార్యాలయానికి ఎవరూ రావద్దని, వచ్చే సోమవారం ప్రజావాణి యాదవిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ఆ ప్రకటన లో వెల్లడించారు. (story : నేటి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version