రక్తదాన శిబిరం విజయవంతం
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని జనసేన నాయకులు కె. నాగ శ్రీను ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జనసేన ను అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. జరిగిన ఎన్నికలలో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గెలుపు కోసం జనసేన నాయకులు కే నాగ శ్రీను జనసేన యువత ఎంతో శ్రమించారని ఈ సందర్భంగా మక్కెన కొనియాడారు. అలాగే రక్తదానం చేసిన యువతకు ఆసుపత్రి డాక్టర్ల బృందానికి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు మక్కెన అభినందనలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షమీంఖాన్, టిడిపి కౌన్సిలర్ బాల గురవయ్య, హాస్పటల్ సిబ్బంది, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ళ అభిమన్యు, శావల్యాపురం మండల అధ్యక్షుడు కడప అనిల్ కుమార్, నూజెండ్ల మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి రాజబాబు, వినుకొండ మండల అధ్యక్షుడు గండికోట మణికంఠ, బొల్లాపల్లి మండల ఉపాధ్యక్షుడు యర్రం శెట్టి వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా పాల్గొన్నారు. (Story : రక్తదాన శిబిరం విజయవంతం)