అయ్యప్ప స్వామి భజన మందిరంలో ఓనం పూజ
న్యూస్ తెలుగు/ధర్మవరం-శ్రీ సత్య సాయి జిల్లా : పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల అయ్యప్ప స్వామి భజన మందిరంలో ఆదివారం ఓనం గురుస్వామి అంబటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఓనం పూజా కార్యక్రమాన్ని అశేష అయ్యప్ప స్వామి భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఓనం గురుస్వామి అంబటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భజన మందిరంలో ఉదయం ఓనం పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, అనంతరం ప్రత్యేక భజనలు, ప్రత్యేక పూజలు అనంతరం పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓనం గురుస్వామి అంబటి సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించే సాంప్రదాయానికి అనుగుణంగా ఓనం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగాఈ ఏడాది కూడా ఓనం పూజ కార్యక్రమాన్నినిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి శిష్య బృందం, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.(story : అయ్యప్ప స్వామి భజన మందిరంలో ఓనం పూజ)