జనసేనాని ఆశయ సాధనకు కృషి చేయాలి
జనసేన నేత గురాన అయ్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : జనసేనాని ఆశయ సాధనకు కృషి చేయాలని జనసేన నేత గురాన అయ్యలు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆదివారం ప్రేమ సమాజం,పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అల్పాహారం ఏర్పాటు చేశారు.స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ జనసేనాని జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 2 వ తేదీన సోమవారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముందుగా పైడిమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు, 5 వ వార్డు బాబామెట్టలో మొక్కలు నాటే కార్యక్రమం, కోరుకొండ గ్రామంలో ఉచిత వైద్య శిభిరం,కంటి వైద్య శిభిరం, పేదలకు చీరల పంపిణీ, దుప్పాడ గ్రామంలో విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ, 15 వార్డు తెలకల వీధిలో రక్తదాన శిభిరం, పేదలకు దుస్తులు పంపిణీ, అన్నదానం, అలాగే వై.ఎస్ .ఆర్ .నగర్ వైద్య శిభిరం, పూలబాగ్ కాలనీలో విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ, మంగళ వీధిలో విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్స్ పంపిణీ,అలాగే పలు వార్డుల్లో కేక్ కటింగ్స్ , స్వీట్స్ పంపిణీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ జన్మదినోత్సవ వేడుకల్లో వీర మహిళలు ,జన సైనికులు, కూటమి నేతలు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కాటం అశ్విని, దుప్పాడ జ్యోతి,పి.రవీంద్ర, పిడుగు సతీష్ , ఏంటి రాజేష్ , సిరిపురపు దేవుడు, టి.రామకృష్ణ(బాలు) దుప్పాడ నరేష్, కోరుకొండ ప్రసాద్ , ఎమ్ .పవన్ కుమార్ , ఎస్ .సాయి(నాని), శ్రీనివాస్, కె.రామకృష్ణ, లీల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (story : జనసేనాని ఆశయ సాధనకు కృషి చేయాలి)