Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నిరుపేదలకు 'శ్రేయ ఫౌండేషన్' సహాయం

నిరుపేదలకు ‘శ్రేయ ఫౌండేషన్’ సహాయం

నిరుపేదలకు ‘శ్రేయ ఫౌండేషన్’ సహాయం

న్యూస్‌తెలుగు/విశాఖపట్నం: సంపాదనలో ఎంతో కొంత నిరుపేదలకు ఇవ్వడంలో సంతృప్తి ఉంటుంది. ఆ‌ సంతృప్తిని ఎంత పెట్టినా కొనలేం. సామాజిక బాధ్యతను తమ కర్తవ్యంగా భావించిన ‘శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీలు’ ఔదార్యం చూపించాయి. కస్టమర్లు, ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ మేరకు ముంబైలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్రేయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా కస్టమర్లు, ఆర్థికంగా వెనుకబడిన ఉద్యోగులకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, శ్రేయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ హేమంత్ కుమార్ రాయ్ మాట్లాడుతూ ప్రధానంగా నాలుగు ప్రోగ్రామ్‌ల ద్వారా సేవ చేసేందుకు ముందుకు వచ్చామన్నారు.

కంపెనీ ప్రవేశ పెట్టిన నాలుగు ప్రోగ్రామ్‌లలో ఒకటోది బిల్డింగ్ మెటీరియల్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం అన్నారు. ఆర్థికంగా వెనుకబడి సొంత ఇంటి కోసం కలలు కనే వారికి ఆర్థిక సహాయం అందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యమన్నారు. శ్రేయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రేయ ఆషియానా ద్వారా, అద్దె ఇళ్లు లేదా సొంత స్థలంలో నివసిస్తున్నప్పటికీ ఇల్లు నిర్మించుకోవడానికి వనరులు లేని వారికి అవసరమైన మద్దతు ఇస్తుందన్నారు. రెండోది చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నారు. దీని కింద ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు నిరుపేదలైన పిల్లల విద్యా ఖర్చులను శ్రేయ ఫౌండేషన్ భరిస్తుందన్నారు. ఆర్థిక పరిమితులు చదువుకు ఆటంకం కలిగించకూడదన్నారు. మూడోది ఉన్నత విద్యా కార్యక్రమం అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అభ్యసించడంలో సహాయపడేందుకు ఈ ప్రోగ్రామ్ రూపొందించబడిందని తెలిపారు. శ్రేయ ఫౌండేషన్ ఉన్నత చదువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. నాలుగోది గర్ల్స్ మ్యారేజ్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం అన్నారు. ఈ ప్రోగ్రామ్ కింద వెనుకబడిన బాలికల వివాహాలకు మద్దతు ఇస్తుందన్నారు. వివాహ సమయంలో కుటుంబాలు ఆర్థిక భారాన్ని ఎదుర్కోకుండా చూసేందుకు ఆర్థిక సహాయం చేయనున్నామని తెలిపారు. నగలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి వస్తువులను అందజేస్తుందన్నారు.

ఈ ప్రోగ్రామ్‌లు శ్రేయ గ్రూప్ అనుబంధ సంస్థలు, కస్టమర్‌లు, ఉద్యోగులకు అందుబాటులో ఉన్నాయన్నారు.‌ దీని ద్వారా 27 వేల మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఏప్రిల్ 2025 నుంచి ఈ కార్యక్రమాలు సాధారణ ప్రజలకు విస్తరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ క్లబ్ సభ్యులు పీ మహేశ్వర్, డీ తత్తయ్య, బీ.ఎం.డీ., విక్రమ్ చక్రవర్తి, ఎం. శ్రీషా, రాజేష్ సింగ్, అవధేష్ కుమార్, జమీల్ అహ్మద్, గౌరవ్ యాదవ్, నానా జీ గంటా, గీత, జలోన్వి, సన్నీ వైస్ ప్రెసిడెంట్, విశాల్ సరోజ్, అజయ్ మిశ్రా, భాను ప్రతాప్ సింగ్, నమిత్ సింగ్, శ్యామ్ మిశ్రా, వివేక్ యాదవ్, ధర్మేంద్ర సింగ్, శ్రేయ గ్రూప్ సీఎండీ శ్రేయ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, సంగీతా రాయ్, వైస్ చైర్ పర్సన్, ఫ్యూచర్ శ్రేయా రాయ్ పాల్గొన్నారు. (Story : నిరుపేదలకు ‘శ్రేయ ఫౌండేషన్’ సహాయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!