అయ్యప్ప స్వామికి ప్రత్యేక ఓనం పూజలు..
గురు స్వామి అంబటి సతీష్ కుమార్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని అయ్యప్ప స్వామి భజన మందిరం నందు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక పూజలు, ఓనం పూజా, పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గురుస్వామి అంబటి సతీష్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి భజనలు, పాటలు నిర్వహించబడతాయని, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని భిక్షను స్వీకరించి ఆశీస్సులు పొందాలని తెలిపారు.. (Story : అయ్యప్ప స్వామికి ప్రత్యేక ఓనం పూజలు..)