Homeవార్తలుతెలంగాణనిత్యవసర ధరల అదుపులో పాలకులు విఫలం : సిపిఐ

నిత్యవసర ధరల అదుపులో పాలకులు విఫలం : సిపిఐ

నిత్యవసర ధరల అదుపులో పాలకులు విఫలం : సిపిఐ

న్యూస్‌తెలుగు/వనపర్తి : నిత్యవసర సరకుల ధరలను అదుపులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీరామ్ విమర్శించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రం లోని సిపిఐ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. బియ్యం, పప్పు, నూనెలు, ఎల్లిగడ్డ, ఉల్లిపాయలు, చింతపండు, జొన్నలు, రాగులు, కూరగాయలు ధరలు సామాన్యుడు కొనలేనంతగా పెరిగాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుతవ్వం రేషన్ షాపుల ద్వారా14 రకాలషాపులకాల నిత్యవసరకులను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసేదనిద్వారాషాపుల ద్వారా పంపిణీ చేసేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వాటికి పాతరేసిందన్నారు. కేంద్రం చక్కెర, గోధుమలు, బియ్యం జొన్నలు రేషన్ షాప్ ల ద్వారా ఇచ్చేదన్నారు. ఏ ఒక్కసరకు కేంద్రం ఇవ్వటం లేదన్నారు. ఫలితంగా ధరలు పెరిగి సామాన్యులు అల్లాడుతున్న పాలకులు మొద్దు నిద్ర పోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు సిపిఐ జాతీయ కమిటీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద అధిక ధరలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిందన్నారు. తెలంగాణలో రెండవ తేదీన జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు జరుగుతాయని నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, పానగల్ మండల కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story ; నిత్యవసర ధరల అదుపులో పాలకులు విఫలం : సిపిఐ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics