డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : పట్టణంలోని నిర్మలా గర్ల్స్ హై స్కూల్ ప్రాంతంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజీ మురుగు నీరు అంతా త్రాగునీటి పైపులైన్ లో కలిసి కలుషితం అవుతుందని, సమస్య వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ సమావేశంలో నిర్మల స్కూల్ యాజమాన్యం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరికి వినతి పత్రం అందజేశారు. మురుగునీరు త్రాగునీటి పైప్ లైన్ లో కలుస్తున్నందువల్ల నీరు కాలుష్యం అయ్యి బాలికలు అస్వస్థకు గురవుతుంటారని, వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని వారు చైర్మన్ ను కమిషనర్ను కోరారు. (Story : డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి)