యూనియన్ బ్యాంక్‌తో టొయోటా కిర్లోస్కర్ మోటర్ భాగస్వామ్యం
న్యూస్‌తెలుగు/బెంగుళూరు: వినూత్న పరిష్కారాల ద్వారా వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా కారు యాజమాన్య అనుభవాలను క్రమబద్ధీకరించాలనే తమ నిరంతర ప్రయత్నంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) నేడు వినియోగదారులకు సమగ్రమైన వాహన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించటం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుంది. కస్టమర్‌ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడం, టొయోటా వాహనాలను గతంలో కంటే మరింత మెరుగ్గా అందుబాటులోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన పరిష్కారాలను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. దీనిలో భాగంగా వ్యక్తిగత వినియోగం కోసం కొనుగోలు చేసిన ఏదైనా టొయోటా వాహనాల ఆన్-రోడ్ ధరపై 90% వరకు ఫైనాన్సింగ్‌ను అందించనున్నారు. అలాగే యూనియన్ వెహికల్ స్కీమ్ కింద సంవత్సరానికి 8.80% నుండి ప్రారంభమయ్యే ప్రస్తుత వడ్డీ రేట్లతో 84 నెలల వరకు సౌకర్యవంతమైన ఈఎంఐ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. (Story : యూనియన్ బ్యాంక్‌తో టొయోటా కిర్లోస్కర్ మోటర్ భాగస్వామ్యం)