వెన్ను, మెడ నొప్పికి ‘విటమిన్ డీ’ లోపమే కారణం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: ప్రపంచంలో లక్షలాది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్ను, మెడ నొప్పితో బాధపడుతూ ఉంటారని, దీనికి ‘విటమిన్ డీ’ లోపమే కారణమని ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు ప్రొఫెసర్ మేజర్ డాక్టర్ ఎస్.భక్తియార్ చౌదరి తెలిపారు. హైదరాబాద్‌లోని హోటల్ గ్రీన్ పార్కులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల పిల్లలు, గృహిణులు, సాయుధ దళాల సిబ్బంది, వివిధ వృత్తులలో ఉన్న రోగులకు నలబై ఏళ్లు చికిత్స అందించిన అనుభవంతో పది వేల మందిని అనవసర శస్త్రచికిత్సల నుంచి రక్షించానని తెలిపారు. ముందుగా జోక్యం చేసుకోవడం, నివారణ వ్యూహాల ద్వారా శస్త్రచికిత్సలను నిరోధించవచ్చని చెప్పారు. తాజా అధ్యయనం ‘అసోసియేషన్ ఆఫ్ విటమిన్ డీ డెఫిషియెన్సీ విత్ ఫ్రోజెన్ షోల్డర్ సిండ్రోమ్, రిపీటీటివ్ స్ట్రెయిన్ ఇంజురీ ఆన్ స్పైన్’ ఇది ప్రచురణలో ఉందన్నారు. ఇందులో అనేక పరిస్థితులను నివారించడానికి వ్యూహాలు అందించనున్నట్లు తెలిపారు. వెన్ను, మెడ నొప్పికి గల కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. (Story : వెన్ను, మెడ నొప్పికి ‘విటమిన్ డీ’ లోపమే కారణం)