UA-35385725-1 UA-35385725-1

దోమలు వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

దోమలు వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

డెంగ్యూ పాజిటివ్ వచ్చిన ఇంటి పరిసరాలతో పాటు చుట్టుపక్కల పారిశుధ్యం, ఫీవర్ సర్వే చేయాలి

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/ వనపర్తి

వర్షాకాలంలో నిలువ నీరు ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఉదయం డ్రై డే కార్యక్రమం సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు పారిశుధ్య కార్యక్రమాలు, వివిధ గ్రామాల్లో వచ్చిన ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు.
కొత్తకోట మున్సిపాలిటీలో 4, 11వ వార్డులు, మదనాపూర్ మండలంలో గోపన్ పేట ప్రాథమిక సబ్ సెంటర్, నర్సింగాయ పల్లి, మదనాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొత్తకోట మండలం నాటెవల్లి గ్రామపంచాయతీల్లో పర్యటించారు. జ్వరం వచ్చిన ప్రాంతంలో పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చుట్టుప్రక్కల ప్రాంతంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయించి పాజిటివ్ వచ్చిన ఇంట్లో పేరత్ర్యన్ మందు పిచికారి చేయించాలని సూచించారు. వైద్య, పారిశుధ్య సిబ్బంది సమన్వయంతో పని చేసి మరిన్ని పాజిటివ్ కేసులు కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.
గోపన్ పేట ప్రాథమిక సబ్ సెంటర్లో మొక్కను నాటిన కలక్టర్ అవుట్ పేషంట్స్ రిజిస్టరు, మందుల నిల్వ రిజిస్టర్ ను పరిశీలించారు.
మదనాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష చేయించుకున్న జిల్లా కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఈ మధ్యకాలంలో వచ్చిన అవుట్ పేషంట్లు, అందులో జ్వరంతో వచ్చిన వారు ఎంతమంది, ఎంతమందికి రక్త నమూనాలు సేకరించారు వాటిలో పాజిటివ్ కేసులు ఎన్ని అని ప్రశ్నించారు. బర్త్ ప్లాన్ ఈ.డి.డి రిజిస్టరు ను పరిశీలించారు. రక్త పరీక్షలు సరిగ్గా చేస్తున్నారా లేదా అని పరిశీలించడానికి కలెక్టర్ స్వయంగా రక్త నమూనా ఇచ్చి డెంగ్యూ, సి.బి.పి. పరీక్షలు చేయమని ల్యాబ్ టెక్నీషియన్ కు ఇచ్చారు. రక్త పరీక్ష నిర్వహించిన విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నాటేవల్లి మండల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
కొత్తకోట మండలంలోని నాటేవళ్లి మండల ప్రాథమికోన్నత పాఠశాలను కలక్టర్ సందర్శించారు. పాత పాఠశాల భవనం శిధిలావస్థలో ఉండటాన్ని గమనించిన కలక్టర్ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి రేపటిలోగా ఇవ్వాలని పంచాయతీ రాజ్ డి. ఈ ని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాటశాల కింద చేసిన పనులను పరిశీలించారు. జిల్లా వైద్య శాఖ నుండి ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. ప్రవలిక, కొత్తకోట ప్రత్యేక అధికారి స్వరన్ సింగ్, మదనాపూర్ ప్రత్యేక అధికారి మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ సూర్య కుమార్, తహశీల్దార్లు జి. బాల్ రెడ్డి, అబ్రహం లింకన్, ఎంపీడీఓ లు, ఇతర వైద్య సిబ్బంది తదితరులుఉన్నారు. (Story : దోమలు వ్యాప్తి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1