బ్యాంకింగ్ సేవలు అందరికీ చేరువ కావాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : బ్యాంకుల సేవలు అన్ని వర్గాల వారికీ చేరువయ్యేలా ఆయా బ్యాంకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ సూచించారు. నగరంలోని చినవీధిలో ఆధునీకరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిని జిల్లా కలెక్టర్ డా.అంబేద్కర్ గురువారం ప్రారంభించారు. యీ సందర్భంగా మాట్లాడుతూ ఆధునీకరించడం ద్వారా ఖాతాదారులకు మరింత సులభతరంగా సేవలందించడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వివిధ వర్గాల రుణ అవసరాలను తీర్చడం ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు విస్తరించుకోవాలన్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.ఎం.పధాన్ మాట్లాడుతూ నగరంలో తమ బ్యాంకుకు మూడు బ్రాంచిలు వున్నట్టు చెప్పారు. తమ బ్యాంకు ద్వారా గృహ, వాహన రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధికంగా వడ్డీలు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ మెహెర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. (Story : బ్యాంకింగ్ సేవలు అందరికీ చేరువ కావాలి)