Home వార్తలు “35-చిన్న కథ కాదు” నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్ 

“35-చిన్న కథ కాదు” నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్ 

0

“35-చిన్న కథ కాదు” నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్ 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ నీలి మేఘముల లో సాంగ్  రిలీజ్ చేశారు. లీడ్ పెయిర్ జర్నీని బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేసిన ఈ పాటని వివేక్ సాగర్ లవ్లీ గా కంపోజ్ చేశారు. భరద్వాజ్ గాలి రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వున్నాయి. సింగల్ పృథ్వీ హరీష్ సోల్ ఫుల్ గా పాడిన ఈ పాట చాలా ప్లజెంట్ గా వుంది.
స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది.
ఈ చిత్రానికి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.
“35-చిన్న కథ కాదు” సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ (Story :”35-చిన్న కథ కాదు” నుంచి నీలి మేఘములలో సాంగ్ రిలీజ్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version