భారీ వృద్ధిని సాధించిన ఎస్ బ్యాంక్
ముంబై: భారతదేశపు ఆరవ-అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్, మొత్తం డిపాజిట్లలో ఇయర్ ఆన్ ఇయర్ చెప్పుకోదగ్గ రీతిలో 20.9% వృద్ధిని సాధించింది, ఆర్థిక సంవత్సరం 2025 మొదటి త్రైమాసికం (క్యూ1ఎఫ్‌వై25) నాటికి ఇది రూ. 2,65,072 కోట్లకు చేరుకుంది. ఈ గణనీయ వృద్ధి, బ్యాంక్‌పై కస్టమర్‌లు ఉంచిన బలమైన నమ్మకం, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది, గత నాలుగు సంవత్సరాలలో బ్యాంక్ నమోదు చేసిన విజయవంతమైన టర్న్‌అరౌండ్‌ను ఇది నొక్కి చెబుతుంది. ఇది బ్యాంక్ అమలు చేసిన ఆర్థిక పునాది మరియు కస్టమర్-కేంద్రీకృత వ్యూహాలను కూడా హైలైట్ చేస్తుంది. పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్‌తో డిపాజిట్ వృద్ధిని బ్యాలెన్స్ చేయటంలో బ్యాంకింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒక సవాలు వాతావరణం మధ్య, ఎస్ బ్యాంక్ వేగాన్ని కొనసాగించడమే కాకుండా పరిశ్రమ సగటులను మించిపోయింది. (Story : భారీ వృద్ధిని సాధించిన ఎస్ బ్యాంక్)