Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మేయర్  విజయలక్ష్మి

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మేయర్  విజయలక్ష్మి

0

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మేయర్  విజయలక్ష్మి

న్యూస్‌తెలుగు/విజయనగరం :  నగరంలోని చిక్కాల వీధి రామ మందిరం వద్ద నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలలో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలంకృతమైన శ్రీకృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుని ఆమె పూజలు చేశారు. అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా చిక్కాల వీధి రామ మందిరంలో చతుర్ధ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణతత్వాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన యొక్క లీలలు, కరుణాకటాక్షాలను ప్రతి ఒక్కరూ పొందాలని అన్నారు. చిన్నతనం నుండి కృష్ణుని వేషధారణలతో పిల్లల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(Story : కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మేయర్  విజయలక్ష్మి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version