కందుల జయలక్ష్మిని హత్య చేసారు
తహసిల్దార్ డి ప్రశాంతి
న్యూస్‌తెలుగు/ చాట్రాయి : చనుబండ గ్రామానికి చెందిన కందుల జయలక్ష్మిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని చాట్రాయి తాసిల్దార్ డి ప్రశాంతి తెలిపారు. పోలీసులు నిర్లక్ష్యం వలనే కేసు నీరుగారి పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కందుల కృష్ణ కూతురు జయలక్ష్మిని చంపేశారని ఏప్రిఎల్ 11వ తేదీన చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆనాటి నుండి కందుల కృష్ణ జిల్లా ఎస్పి, ఏపీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కు ఆ తర్వాత మంత్రి సారధికి హోం మంత్రి అనితకు తన గోడు వెళ్ళబుచ్చుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో గత నాలుగు రోజుల క్రితం చాట్రాయి తాసిల్దార్, పోలీసులతో కలిసి విచారణ ప్రారంభించారు. దానిపై ఆమెను శుక్రవారం సాయంత్రం వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ. విచారణలో కందులు జయలక్ష్మిని హత్య చేసినట్లు గుర్తించామన్నారు. తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఉంటే విషయం ఎప్పుడో బయటపడి ఉండేది అన్నారు. కేవలం పోలీస్ అధికారులు నిర్లక్ష్య వైఖరితో కేసు నీరు గార్చరన్నారు. ఆరోజు కేసు కట్టలేని వాళ్ళు ఈరోజు ఎలా కట్టారు అన్నారు. జయలక్ష్మిని చంపిన వారిని వారికి సహకరించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. (Story : కందుల జయలక్ష్మిని హత్య చేసారు )