Home వార్తలు గుళ్ళపల్లి ఎన్‌.రావును సత్కరించిన ప్రపంచ నేత్ర వైద్య సంస్థ

గుళ్ళపల్లి ఎన్‌.రావును సత్కరించిన ప్రపంచ నేత్ర వైద్య సంస్థ

0

గుళ్ళపల్లి ఎన్‌.రావును సత్కరించిన ప్రపంచ నేత్ర వైద్య సంస్థ

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆఫ్థల్మాలజీ ఎల్‌ వి ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపిఇఐ) స్థాపక అధ్యక్షులు డా.గుళ్ళపల్లి ఎన్‌ రావుకు ప్రతిష్టాత్మక 2024 సంవత్సర ఐసివో జూల్స్‌ ఫ్రాన్సువా స్వర్ణ పతకం ఇచ్చి సత్కరించింది. కెనడా వాంకోవర్‌లో జరిగిన ప్రపంచ ఆఫ్థల్మాలజీ కాంగ్రెస్‌ 2024 (డబల్యూవోసి2024) లో ప్రపంచమంతటి నుంచి వచ్చిన తన సమతుల్యుల సమక్షంలో ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. ఐసివో జూల్స్‌ ఫ్రాన్సువా స్వర్ణ పతకం ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి ‘అత్యున్నత వైజ్ఞానిక నాణ్యత గల నేత్ర సంబంధిత కృషి’ కి ఇవ్వబడుతుంది. డా రావు ఈ పతకంచే గౌరవించబడిన మొదటి భారతీయుడు మరియు ప్రపంచంలో దీనిని పొందిన పదకొండు మందిలో ఒకరు. (Story : గుళ్ళపల్లి ఎన్‌.రావును సత్కరించిన ప్రపంచ నేత్ర వైద్య సంస్థ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version