వనపర్తి లో ఐదు రోజులుగా మంచినీరు,
కరెంటు సరఫరాల్లో అంతరాయం
న్యూస్‌తెలుగు/వనపర్తి : గత ఐదు రోజులుగా వనపర్తి పట్టణంలో మంచినీరు సరఫరా కాకుండా, ఏవేవో కారణాల చేత మిషన్ భగీరథ నీరు రావడం లేదు. గతంలో ఎండాకాలంలో మాత్రమే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కానీ భారీ వర్షాలతో భారీ వరదలతో జూరాల నుండి శ్రీశైలం వరకు చెప్పలేనంత నీరు ఉన్న వనపర్తి పట్టణానికి మాత్రం నీరు సరఫరా లేదు దీనికి కారణం ఎవరు అవగాహన లేని నాయకులా? లేక నిస్తేజంగా పని చేస్తున్న అధికారులా ? వనపర్తి జిల్లాలో కలెక్టర్ గారు ఒక్కరే పని చేస్తున్నారని కిందిస్థాయి అధికారులు సరిగా పనిచేయడం లేదని ప్రజలు అనుకుంటున్నారు వారి కింద ఉన్నవారు వస్తున్నామా? పోతున్నామా? సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటున్నామా అన్నట్లు పనిచేస్తున్నారు తప్ప ఎవ్వరు గతంలోలా పనిచేయడం లేదని పలు పార్టీల నాయకులు ప్రజలు చర్చించుకుంటున్నారు.
రామన్ పాడు నుండి వనపర్తి వరకు లోపం ఎక్కడ ఉందో, ఏది సరిచేయాలో చెప్పకుండా ఐదు రోజుల తర్వాత ఫోటోలు దిగి సమస్య పరిష్కరించాలంటూ మాట్లాడే అవగాహన లేని మాటలను చేతలను ప్రజల ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. వెంటనే రామన్ పాడు మంచినీటి సరఫరాను పునరుద్ధరించి వాటిలో ఉన్న లోపాలను సరిజేసి ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చాలని అలాగే కరెంటు కోతలను అరికట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది.(Story : వనపర్తి లో ఐదు రోజులుగా మంచినీరు, కరెంటు సరఫరాల్లో అంతరాయం )